అమెరికాకు వెళుతున్న మోదీ
అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళుతున్న మోదీ, తన పర్యటనలో భాగంగా వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నారు. ‘భారత ప్రధాని మోదీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాం’ అని అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి హీథర్ నార్ట్ విలేకరులతో వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఆయనతో మూడు సార్లు టెలిఫోన్లో సంభాషించారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తొలి అమెరికా పర్యటన ఇదే కానుంది.








