మోడీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన దేశాధ్యక్షుడు
ప్రధాని నరేంద్ర మోదీకి నెదర్లాండ్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ మార్క్ రుటె ఓ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. తాను రోజూ ఆఫీస్‌కు రావడానికి రాడే వాహనమది. మనలాగే అక్కడి ప్రధానికి పెద్ద కాన్వాయ్ ఉండదు. ఆయన సింపుల్‌గా రోజూ సైకిల్ వేసుకొని ఆఫీసుకు వస్తారు. సాయంత్రం మళ్లీ అలాగే ఇంటికెళ్తారు. ఇప్పుడదే సైకిల్‌ను మోదీకి రుటె గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆయన పక్కనుండగానే, మోదీ సైకిల్‌పైకి ఎక్కారు. ఈ సందర్భంగా ఇద్దరు మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫొటో ఇప్పుడు నెట్లో వైరల్ అయింది. రుటెకు థాంక్స్ చెబుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.













