పార్టీ సభ్యత్వానికి నారాయణ రాణె రాజీనామా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె, ఆయన కుమారుడు, మాజీ ఎంపీ నీలేశ్ ఆ పార్టీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్టు తెలిపారు. గతంలో సీఎంగా పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు.








