జోజో లాలీ జో : గ్రౌండ్ లో ధోనీ కునుకు
అది ఇండియా – శ్రీలంక క్రికెట్ మ్యాచ్. సిరీస్ డిసైడ్ గేమ్. టీమిండియా విజయానికి దగ్గర్లో ఉంది. ఈ టైంలో శ్రీలంక అభిమానులు రెచ్చిపోయారు. సొంత జట్టు చిత్తుగా ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. గ్రౌండ్ లోకి వాటర్ బాటిల్స్, ప్లే కార్డ్స్, బ్యానర్స్ విసిరారు. మరో ఎనిమిది పరుగులు చేస్తే మ్యాచ్ ఇండియా సొంతం. ఈటైంలో లంక అభిమానుల ఆగడాలతో మ్యాచ్ కు బ్రేక్ వచ్చింది. క్రీజ్ లో ధోనీ, రోహిత్ ఉన్నారు.
మ్యాచ్ చాలా సేపటికి తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో కొద్దిసేపు రోహిత్ తో మాట్లాడాడు. మరికొంత సమయం పిచ్ పై కూర్చుకున్నాడు ధోనీ. అయినా గేమ్ స్టార్ట్ కాలేదు. దీంతో చక్కగా గ్రౌండ్ పడుకున్నాడు. ఓ కునుకు కూడా తీశాడు. ఓ ఐదు నిమిషాలు ధోనీ అలాగే పడుకుని ఉండిపోయాడు. అప్పటి వరకు సీరియస్ గా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ధోనీ కునుకుతో స్టేడియంలో నవ్వులు విరిశాయి. కామెంటేటరీలు కూడా జోకులు పేల్చారు. క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం కావొచ్చు.. ఓ ఆటగాడులో గ్రౌండ్ లో కునుకు తీయటం. ధోనీ క్లోజప్ చూస్తే కూడా స్పష్టంగా అర్ధం అవుతుంది.. కళ్లు మూసి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ పేలుతున్నాయి.








