లంక ఐదో వన్డే : ధోనీ వరల్డ్ రికార్డ్
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్ లు చేసిన రికార్డును ధోని సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో చివరి వన్డేలో ధోని ఈ ఘనతను సాధించాడు. లంక ఆటగాడు అకిల దనంజయ అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో ధోని వంద స్టంపింగ్స్ రికార్డును సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డులెక్కాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ పేరిట ఉన్న 99 స్టంపింగ్ ల రికార్డును ధోని అధిగమించాడు. లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్ లో ధోని వంద స్టంపింగ్స్ మార్కును చేరుకున్నాడు.








