మెగాస్టార్ తో ఎంపీ కవిత సెల్ఫీ
టీఆర్ఎస్ ఎంపీ కవిత కాంగ్రెస్ ఎంపీ, మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఒకరినొకరు పలకరించుకుంటూ సరదాగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత తన అభిమాన హీరో అయిన చిరంజీవితో సెల్ఫీ దిగారు. చిరుతో దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ మూవెంట్ విత్ మెగాస్టార్ అని ట్వీట్ చేశారు. కవితతో పాటు ఇతర ఎంపీలు కూడా చిరుతో సెల్ఫీలు దిగారు.








