48 గంటల్లో రాష్ట్రానికి రుతుపవనాలు
మరో 48 గంటల్లో రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. మధ్య మహారాష్ట్ర, కర్నాటకలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపారు. ఈనెల 7నే రుతుపవనాలు ఆంధ్రాలోకి వచ్చాయి. మరోవైపు అల్పపీడన ప్రభావంతోని రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కూడా సాగుకు రెడీ అవుతున్నారు. తొలకరి వర్షాలతో దుక్కులు దున్నతున్నారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీవర్షాలతో జిన్నారం మండలంల తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లా ను కలిపే ఈరోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు ఆగిపోయినయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో వానలు పడుతున్నయి. వరంగల్ అర్బన్ లోనూ పొద్దున వాన పడింది.
ఉత్తర, ఈశాన్య బంగాళాఖాతంల ఉన్న అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్రంగా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రాలో వచ్చే మూడు నాలుగు రోజుల్లో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సారి దేశమంతటా వానలు బాగానే పడుతాయని …తెలంగాణలో కూడా భారీగా వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.








