వర్షాకాల పార్లమెంట్ తేదీలు ఖరారు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 17న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరిపేందుకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు.








