జూన్ 8వ తేదీ తరవాత రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు జూన్ 8వ తేదీ తరవాత తెలంగాణను తాకనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.8, 9 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతాయని, వీటికి రుతుపవనాల రాకనే కారణమని అంచనా వేస్తుంది.గత వారం రోజులుగా కేరళ రాష్ట్రంలోనే ఆగిన రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. రాబోయే 3, 4రోజుల్లో అవి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ వరకూ వచ్చే అవకాశాలున్నాయి.








