రాష్ట్రపతి రేసులో లేను
రాష్ట్రపతి రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కొట్టిపారేశారు. ఒకవేళ ఆ పదవికి తన పేరును ప్రతిపాదించినా తాను అంగీకరించనని ఆయన సృష్టం చేశారు. కొన్ని వార్తాల సంస్థలు తమ మనుగడకోసం ఇలాంటి ట్రిక్కులు ప్రచారం చేస్తుంటాయన్నారు. సంఘ్ పరివార్ సభ్యుడిగా తన జీవితం సంస్థకు, సమాజానికి అంకితమన్నారు. సంఘ్లో చేరాక తాము అన్ని దార్లను మూసివేస్తామని, మేము కేవలం సంఘ్ కోసం, సమాజం కోసమే పనిచేస్తామన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు ప్రచారంలోకి రావడం విడ్డూరమన్నారు.













