వెంకయ్యనాయుడుకు పళనిస్వామి మద్దతు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడుకు అన్నాడీఎంకే (అమ్మ వర్గం) మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులతో ఆయన ఈ విషయమై సమావేవమయ్యారు.








