వివేక దెబ్రాయ్ నేతృత్వంలో ఆర్థిక సలహా మండలి
దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐదుగురు సభ్యుల ఆర్థికవేత్తలతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తారు. ఈ ఆర్థికసలహాదారుల మండిలికి నీతి ఆయోగ్ ప్రిన్సిపల్ సలహాదారులు రతన్ వాటాల్తో పాటు సభ్యులుగా ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భట్టా, రెతిన్రాయ్, అశిమ్ గోయెల్ పార్ట్‌టైం సభ్యలుగా ఉంటారు. వీరంతా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను విశ్లేషించి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సలహా ఇస్తారని ప్రభుత్వం సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.








