అత్యంత ప్రభావశీల జాబితాలో మోదీ
ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తులను ఎంపిక చేసేందుకుగాను టైమ్ మేగజైన్ రూపొందించిన ప్రముఖుల జాబితా(ప్రాబబుల్స్)లో ప్రధాని నరేంద్ర మోదీకి చోటుదక్కింది. గతేడాది కూడా మోదీ పేరు ప్రాబబుల్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన తుది జాబితాకూ ఎంపికై, ప్రపంచంలోనే వందమంది అత్యంత ప్రభావవీల వ్యక్తుల్లో (2015కు సంబంధించి) ఒకరిగా నిలిచారు. దీంతో టైమ్ మేగజైన్ కోసం మోదీ ప్రొఫైల్‌ను అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒరాక్ ఒబామా రాసిచ్చారు. తాజాగా విడుదల చేసిన ప్రాబబుల్స్ జాబితా (2016కు సంబంధించి) నుంచి వందమంది అత్యంత ప్రభావశీల వ్యక్తులను టైమ్ ఏప్రిల్‌లో ప్రకటిస్తుంది.













