అమెరికాలో పెరిగిన భారతీయ విద్యార్థులు
గత మూడేళ్లుగా అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య స్థిరంగా పెరిగింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్ లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఇ) ప్రకారం, 2015-16లో ఒక లక్షా 60వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. భారతీయ విద్యార్థుల శిక్షణ, ఉపాధి సహా వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపై అమెరికా ప్రభుత్వం, కాంగ్రెస్తో భారత్ చర్చిస్తోందని మంత్రి తెలిపారు.







