మినీ త్రీడీ ద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ!
మానవ అవయవాలను త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందించే సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా శాస్త్రవేత్తలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్వవస్థను అభివృద్ది చేశారు. మానవ కణజాలాన్ని వినియోగించి మినీ త్రీడీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను అమెరికాలోని నార్త్వెస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనికి ఎవతార్ అని నామకరణం చేశారు. ఇందులో అండాశయం, అండవాహిక, మూత్రాశం, సర్విక్స్, యోని, కాలేయం నుంచి రక్తం పంపిణీకి సంబంధించిన నాళాలు వంటి భాగాలు ఉన్నాయి. స్త్రీలకు వచ్చే గార్భయ, అండశయ వ్యాధులు, సంతాన సాఫల్య లోపాలు వంటి వాటిపై పరిశోధనకు ఈ నమూనాను వినియోగించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.













