జెండా ఎగురవేయని కాశ్మీర్ సీఎం
కాశ్మీర్ లో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. జమ్మూ, లడఖ్ లో ఉన్న శాంతియుత పరిస్థితులు కాశ్మీర్ లో లేవన్నారు. యువత పెన్నులకు బదులు తుపాకులు పట్టుకోవడం కాశ్మీర్ ను దిగజార్చిందన్నారు. ఆర్టికల్ 370పై మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయన్నారు. గతంలో ఇలాంటి వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని… ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. ఆర్టికల్ 370పై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా ఒక తండ్రిలా తనకు దిశానిర్దేశం చేశారన్నారు. శ్రీనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఫ్తీ… జెండా మాత్రం ఎగరేయలేదు.








