మాయావతి రాజీనామా ఆమోదం
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. ఆమె మూడు పేజీల రాజీనామాను సమర్పించారు. ఇది నిర్దిష్ట నమూనాకు అనుగుణంగా లేకపోవడంతో దీనికి ఆమోదం లభించదేమోనని చాలా మంది భావించారు. మాయావతితో రాజ్యసభ అధికారులు మాట్లాడటంతో ఆమె మరోసారి నిర్దిష్ట నమూనాలో రాజీనామాను సమర్పించారు. దీంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమె రాజీనామాను ఆమోదించారు.








