దిల్లీ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్గా మల్లాది శైలజా సుమన్
దేశ రాజధాని ఆకాశవాణి కేంద్రం సంచాలకురాలుగా తొలిసారి తెలుగు మహిళ నియమితులయ్యారు. ఆకాశవాణి, దూరదర్శన్లో మూడు దశాబ్దాలకు పైగా మార్కెటింగ్ విభాగంలో సేవలందించిన మల్లాది శైలజా సుమన్ ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకురాలిగా నియమితులయ్యారు. శైలజాసుమన్ ఆధ్వర్యంలో రూపొందించిన అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ, రజత నందులు గెలుచుకున్నాయి. విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి కేంద్రం పూర్తిస్థాయిలో ఏర్పడానికి శైలజాసుమాన్ విశేష కృషి చేశారు.








