ప్రధాని మోదీతో లక్ష్మీపార్వతి భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వైసీపీ నాయకురాలు లక్ష్మిపార్వతి భేటీ అయ్యారు. అయితే, ఎంతో సంచలనం కలిగించే ఈ వార్త ఎక్కడా రాలేదు. కేవలం ఒక వెబ్ సైట్ మాత్రమే ఈ వార్తను ప్రచురించింది. కనీసం వైసీపీ మీడియా సాక్షిలో కూడా దీనికి సంబంధించిన కథనం రాకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఈ భేటీ జరినట్లు తెలుస్తోంది. మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఢిల్లీకి వెళ్లి ఆయనను కలిశారు లక్ష్మీపార్వతి. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియరాలేదు. అయితే, దివంగత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరేందుకు ప్రధానిని లక్ష్మీపార్వతి కలిశారని చెబుతున్నారు.








