కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా
కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి తెలంగాణ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమాభారతి, రాధా మోహన్ సింగ్, సంజీవ్ బలియాన్, గిరిరాజ్ సింగ్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.








