రామ్‌నాథ్ కోవింద్‌కు అగ్రరాజ్యం శుభాకాంక్షలు
భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. కోవింద్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించింది. ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడేలా సఖ్యత పెరిగేలా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ సృష్టం చేసింది. భారత్, అమెరికా చక్కటి స్నేహబంధంతో అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయని పేర్కొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతినిధి న్యూయర్ట్, ఈ బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.








