శబరిమలలో స్వర్ణ ధ్వజస్తంభం ప్రతిష్టాపన
శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో స్వర్ణ ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరగనుంది. ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 1.40 వరకు స్వర్ణ ధ్వజస్తంభం మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులు పాల్గొననున్నారు. అలాగే ఈనెల 28వతేదీన ధ్వజారోహణం జరగనుంది. అలాగే పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు, జులై 6న పల్లివేట్ట ఉత్సవం జరగనుండగా జులై 7న ఉదయం11గంటలకు పంబా నదిలో అయ్యప్ప ఉత్సవమూర్తికి జలాభిశేకం జరగనుంది. అదే రోజు అయ్యప్పస్వామి ఉత్సవాలు ముగియనుండగా… అదే రోజు అయ్యప్ప దర్శనం, దేవాలయం మూసివేస్తారు.








