వంద రోజుల్లో ఎన్నికలొస్తే వస్తా
తమిళనాట వంద రోజుల్లో ఎన్నికలొస్తే రాజకీయాల్లోకి వస్తా, వాటిని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు సిద్దం అంటూ సినీహీరో కమల్‌హాసన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఓ బలవంతపు పెళ్లితో పోల్చారు. అన్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలొస్తే, రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు.








