అటార్నీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన కేకే వేణుగోపాల్
భారత 15వ అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది కె.కె.వేణుగోపాల్ (86) బాధ్యతలు స్వీకరించారు. న్యాయకోవిదుడిగా, రాజ్యాంగ నిపుణుడిగా పేరు గాంచిన వేణుగోపాల్‌ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్‌లతో ఇప్పటికే సత్కరించింది. ఇప్పటిదాక అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ వారసుడిగా వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు.








