సుప్రీంకోర్టు సిజెగా దీపక్ మిశ్ర
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్ర నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయమంత్రిత్వశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ దీపక్ మిశ్ర వయసు 63 సంవత్సరాలు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్. ఖేహర్ ఈ నెల 27న పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.








