స్పెషల్ ఆఫర్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్
జెట్ ఎయిర్వేస్ రానున్న రుతుపవనాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ఫీజులతో కలిపి 1079 రూపాయలకే విమాన టికెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలోనే ఈ ప్రత్యేక డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయి. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికపై నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ స్పెషల్ ఆఫర్ కింద టికెట్ల బుకింగ్ తెరిచి ఉంటుంది. ప్రయాణికులు జూన్ 15 నుంచి సెప్టెంబరు 20 తేదీల మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. రెండు వైపుల ప్రయాణానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.








