చెన్నై, బెంగళూరు నుంచి జెట్ నాన్‌స్టాప్ సర్వీసులు
చెన్నై, బెంగళూరుల నుంచి ఐరోపా దేశాలకు నాన్‌స్టాప్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు జెట్ ఎయిర్వేస్ డైరెక్టర్ గౌరంగ్ శెట్టి తెలిపారు. దక్షిణ భారత్‌లో తమ సేవలను పెంచుకునేందుకు దృష్టి సారించామని చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌లో చెన్నై, బెంగళూరుల నుంచి నూతన నాన్‌స్టాప్ సర్వీసులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో కొత్త సర్వీసుల ప్రారంభం సందర్భంగా ఎకానమీ క్లాస్‌లో రూ.33,999, ప్రీమియర్ క్లాస్‌లో రూ.1,29,999 టిక్కెట్ ధరలు ఉంటాయని చెప్పారు.








