అమర్నాథ్ యాత్ర ప్రారంభం
పటిష్ఠ భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ము కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ జెండా ఊపీ యాత్రను ప్రారంభించారు. శ్రీనగర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ నుంచి 3,888 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 14000 అడుగుల ఎత్తులోకొలువైన ఉన్న అమరనాథుడిని దర్శించుకోవడానికి భక్తుల తొలి బృందం జమ్ము నుంచి బయలుదేరింది. ఉగ్రదాడులు జరగవచ్చన్న సమాచారంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1181 పురుషులు, 422 మంది మహిళా భక్తులు, 47 మంది సాధువులు సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో బయలుదేరారు. ఈ యాత్ర 40 రోజుల పాటు కొనసాగుతుంది. 2లక్షల 30వేల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 7న ముగియనుంది.








