ఇస్రోకు ప్రధాని మోదీ ప్రశంసలు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ38 రాకెట్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఇస్రో చేసిన 17వ ప్రయోగంలో, నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి 31 ఉపగ్రహాలను ప్రవేశపెట్టినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కష్టపడిన ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో బృందమంతా తమను గర్వపడే విధంగా చేశారని తన సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు.








