త్వరలో ఐరన్ లేడీ పెళ్లి
ఐరన్ లేడీ ఇరోమీ షర్మిళ పెళ్లి దాదాపు ఫిక్స్ అయ్యింది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఆమె మ్యారేజ్ అప్లికేషన్ పెట్టుకున్నది. తన బ్రిటీష్ స్నేహితుడు డెస్మండ్ కౌటినోను ఆమె పెళ్లి చేసుకోన్నుది. మణిపూర్‌లో ఆర్మీ ప్రత్యేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన షర్మిళ వివాహం మరో నెల రోజుల తర్వాత జరిగే వీలు ఉన్నది. తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసులో ఆమె పెళ్లి దరఖాస్తు చేసుకున్నది. కులాంతర వివాహం కావడం వల్ల హిందూ మ్యారేజ్ చట్ట ప్రకారం అప్లికేషన్ ఫైల్ చేశారు. ఆ అప్లికేషన్‌ను 30 రోజుల పాటు నోటీస్‌లో ఉంచుతారు. మణిపూర్ ఎన్నికల్లో దారుణంగా ఓడిన షర్మిళ ఇటీవల కొడైకెనాల్‌కు చేరుకుని అక్కడ స్నేహితుడితో ఉంటున్నది.













