ఉక్కు మహిళ ప్రేమ వివాహం
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల త్వరలో పెళ్లి చేసుకోనుంది. తన బాయ్ ఫ్రెండ్, బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కొటిన్హోను వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని షర్మిల, డెస్మండ్ ఇద్దరూ ధ్రువీకరించారు. అయితే, పెళ్లి తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు. కాగా, ఈ జంట ప్రస్తుతం తమిళనాడులోని మదురులో ఉన్నారు. అనుమతలు లభించిన తరువాత తామిద్దరం ఇక్కడే పెళ్లి చేసుకుంటామని డెస్మండ్ తెలిపారు. షర్మిల తీసుకున్న నిర్ణయంపై ఆమె సోదరుడు ఇరో సంఘాజిత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.








