జైట్లీని కలిసిన ఇన్ఫోసిస్ కో-చైర్మన్
ఇన్ఫోసిస్ కో-చైర్మన్ రవి వెంకటేశన్. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జైట్లీతో వెంకటేశన్ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. గత వారం ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా రాజీనామా చేసినది తెలిసిందే.








