సర్జికల్ దాడులతో మంచి ఫలితాలు వచ్చాయి
పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులు అనూహ్య ఫలితాలను ఇచ్చాయని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడుల కారణంగా మన దేశంలోకి చొరబడుతున్న టెర్రరిస్టుల సంఖ్య బాగా తగ్గిందని ఆయన చెప్పారు. సర్జికల్ దాడులు జరగడానికి ముందు ఆరు నెలల కాలంతో పోలిస్తే చొరబాట్ల సంఖ్య 45 శాతం తగ్గిపోయిందని వెల్లడించారు.








