స్పెషల్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
ప్రైవేట్ క్యారియర్ ఇండిగో స్పెషల్ ప్రమోషనల్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.970లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. ఆగస్టు 16 వరకు ఈ ఇండిగో ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 26 నుంచి మార్చి 24, 2018 మధ్యకాలంలో ప్రయాణింవచ్చు. ఇండిగో అధికారిక వెబ్సైట్ www.goindigo.in ప్రకారం ఢిలీ-జైపూర్ మార్గంలో రూ.970 ఆఫర్ వర్తిస్తుంది. ఎంపిక చేసిన మార్గాల్లో నాన్‌స్టాప్ విమానాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణానికి 15 రోజులకు ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ క్రింద లభించే సీట్ల సంఖ్యను ఇండిగో వెల్లడించలేదు. ఈ ఆఫర్ సీట్ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇండిగోకు చెందిన అన్ని బుకింగ్ ఛానల్స్ ఈ ఆఫర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఢిల్లీ-ముంబాయి టికెట్ ధర రూ.1,941, ఢిల్లీ-నాగపూర్ రూ.1,578, ఢిల్లీ-పూణే రూ.2,049, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ.1,418, ఢిల్లీ -బెంగళూరు రూ.2,479గాను ఉన్నాయి.













