సమ్మర్ సేల్ ప్రకటించిన ఇండిగో
చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో సమ్మర్ స్పెషల్ సేల్ కింద 899 రూపాయల ప్రారంభ ధరతో విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ముంబై-గోవా, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్ట్‌బ్లెయిర్, గువహతి-హైదరాబాద్, ముంబై-గువహతి, జమ్మూ-అమృత్సర్, ఢిల్లీ-ఉదయ్‌పూర్, కోల్‌కతా-అగర్తాలా తదితర గమ్యస్థానాలకు 899 రూపాయల ప్రారంభ ధరతో టికెట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద మే 8 నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. మే 10వ తేదీ వరకు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది.













