మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
చౌకరకం విమానయాన సంస్థ ఇండిగో మూడు రోజుల పాటు ప్రత్యేక మాన్సూన్ సేల్ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సెల్ జూన్ 12 నుంచి 14 వరకు కొనసాగుతుంది. ప్రయాణతేదీలను జులై 1నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని పన్నులు కలుపుకుని ప్రారంభ టిక్కెట్ ధర రూ.899 ఎంపిక చేసిన రూట్లకు ఇవి వర్తిస్తాయి. అవి, ముంబై-గోవా, జమ్ము-అమృత్సర్, ఢిల్లీ-ఉదయ్‌పూర్, అహ్మదాబాద్- ముంబై, చెన్నై-పోర్టు బ్లెయిర్, హైదరాబాద్-ముంబై, కోలకతా-అగర్తాలా, ఢిల్లీ-కోయంబత్తూరు, గోవా-చెన్నూ రూట్లతో పాటు దేశశ్యాప్తంగా మొత్తం 39 రూట్లకు వర్తిసాయని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎవరు ముందు వస్తే వారికి టిక్కెట్లు అన్న చందనా టిక్కెట్లు ఇవ్వబడతాయి. ఒక్కసారి టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే రీఫండ్ ఇవ్వబడదని ఇండిగో సృష్టం చేసింది.








