ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి
భారత సంతతి వ్యక్తి లియో వరద్కర్ (38) ఐర్లాండ్ తదుపరి ప్రధానిగా కానున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సెంటర్ రైట్ పార్టీ ఫైన్ గయెల్ పార్టీ భారీ విజయాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశమైన పార్టీ లియో వరద్కర్ను ప్రధానిగా ఎన్నుకుంది. గే అయిన లియోను ప్రధానిగా ఎన్నుకోవడం ఐర్లాండ్ సామాజిక పరివర్తనకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 13న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికైన అతి పిన్న వయస్కునిగా లియో వరద్కర్ రికార్డు సృష్టించారు. వరద్కర్ తండ్రి అశోక్ ముంబయిలో పుట్టి పెరిగారు. 1970లో ఐరిష్ నర్సు మిరియంను ఇంగ్లాండ్లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఐర్లాండ్లో స్థిరపడ్డారు.













