చైనా, పాకిస్థాన్ ఇక కాస్కోండి…ఈగ కూడా భారత్ బోర్డర్లోకి రాలేదు..!
తరచుగా చైనా, పాకిస్థాన్ నుంచి సైనికులు మన భూభాగంలో ప్రవేశించడం, మనం సైన్యం తిరిగి స్పందించడం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, పొరుగుదేశాలు చేస్తున్న ఈ ఆగడాలకు చెక్ పెట్టాలని డిసైడయ్యింది మోడీ సర్కార్. దేశానికి అన్ని వైపుల సరిహద్దుల్ని పరిరక్షించే విధంగా దేశాన్ని నిరంతం గస్తీ కాస్తూ, శత్రువులపై డేగ కన్ను వేసే ఒక ఉపగ్రహాన్ని తయారుచేయాల్సిందిగా, ప్రభుత్వం నుంచి ఇస్రోకు ఆదేశాలు వెళ్లాయి.
ఒకవైపు తీవ్రవాదులు, పొరుగు దేశాల ఆక్రమణ చర్యలు, తాజాగా ఢోకలాం వివాదం అన్నీ కలిసి భారత సర్కారును ఆలోచనలో పడేశాయి. సాంకేతికతను ఉపయోగించుకుని, ఇలాంటి వాటి గుట్టు రట్టు చేయడానికి, దేశానికి రక్షణ కవచంలా అన్ని సరిహద్దుల్నీ నిరంతరం సైనికుడిలా కాపలా కాయడమే ఉపగ్రహం బాధ్యతలు. రియల్ టైమ్ శాటిలైట్ అని చెప్పే ఈ ఉపగ్రహం, మన దేశం చుట్టూ కదలికలపై లైవ్ గా రిపోర్ట్స్ పంపుతుంది. అంతే కాక, ఉన్నది ఉన్నట్టుగా ఆకాశం నుంచి చూసే విధంగా ఈ ఉపగ్రహం పనిచేస్తుంది.
ఈ కొత్త ఉపగ్రహం పూర్తిగా బీఎస్ఎఫ్, ఆర్మీకే అంకితం చేస్తారు. ఇండియన్ ఆర్మీ చేతిలొ ఇప్పటికే 13 శాటిలైట్స్ ఉన్నాయి. అయితే వాటి నుండి సమాచారం సరిహద్దు దళాలకు చేరడానికి చాలా సమయం తీసుకుంటోంది. దీనితో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి, నిముషాల వ్యవధిలోనే లైవ్ గా అప్ డేట్ వచ్చేలా తాజా శాటిలైట్ ను డిజైన్ చేయనున్నారు. ఈ శాటిలైట్ యాక్సెస్ పూర్తిగా ఆర్మీ, బోర్డర్ ఫోర్స్ చేతిలోనే ఉంటుంది. ముష్కరులు గానీ, శత్రువులు గానీ బోర్డర్ దాటితే గుర్తించి, మన సైనికుల్ని వెంటనే అలెర్ట్ చేయడం ఈ శాటిలైట్ ప్రత్యేకత. చైనాకు, పాక్ కు బోర్డర్ దాటే సాహసం చేయాలనుకుంటే మరణమే గతి.








