కాకినాడ ఫోటోగ్రాఫర్‌కు అమెరికా గౌరవ పురస్కారం
గ్రామీణ జీవనశైలితో కాకినాడ కెమెరా క్లబ్ జాయింట్ సెక్రటరీ ప్రముఖ ఫోటో గ్రాఫర్ ఎస్వి అరుణ్‌కుమార్ తీసిన ఛాయా చిత్రాలకు అమెరికాలోని ”ఇయేజ్ కొలిగ్ సొసైటీ” అత్యున్నత అరుదైన గౌరవపురష్కారాన్ని ప్రకటించింది. కాకినాడకు చెందిన ఎస్వి అరుణ్‌కుమార్ 20 సంవత్సరాలు పైబడి ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతూ రాష్ట్రంలో జరిగే పలు వర్క్‌షాపులో పాల్గొని పిక్టోరియల్ ఫోటోగ్రాఫర్పై ఆసక్తిని పెంచుకుని అంశాన్ని ఎంపిక చేసుకుని చిత్రాలు తీసారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ తరుపున చీరాలలో జరిగిన వర్క్‌షాపుల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీలతో పాటు అంతర్జాతీయంగా జరుగుతున్న ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొంటూ ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రకృతి బడిలో ఎలాంటి కల్మషం లేకుండా సామాన్య జీవితాను గడిపే పలురకాల గ్రామీణ స్థితిగతుల-జీవనశైలిపై స్వయంగా చూసిన తర్వాత వారిపై ఫోటో డాక్యుమెంటరీ తీయాలనే పట్టుదలతో ఎస్వి అరుణ్‌కుమార్ పలుమార్లు సందర్శించి చిత్రీకరించారు. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ టోని కిమ్ తాన్ ఇమెయిల్ ద్వారా ఎస్వి అరుణ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ సర్టిఫికెట్ జారీ చేసారు. దీనితోపాటు ఫోటోగ్రఫీ సొసైటీలో శాశ్వత సభ్యుడుగా సభ్వత్వాన్ని గుర్తించారు.








