జూలై 12 నుంచి హైదరాబాద్-శ్రీలంకకు విమాన సేవలు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసును శ్రీలంక ఎయిర్లైన్స్ నేటి నుంచి నడపనుంది. దీనికోసం ఏ320 విమానాన్ని కేటాయించింది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో దీన్ని నడపనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం సీఈఓ ఎస్జీకే కిశోర్ మాట్లాడుతూ ఈ విమాన సర్వీసు ప్రారంభంతో ఇక్కడ నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య పెరిగిందని తెలిపారు. 13 నగరాల నుంచి ప్రయాణికులు ఈ సేవలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 18 అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. 2016-17లో 1.524కోట్ల ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణించారు.








