భారత్ దౌత్య విజయం
ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదమైనా దానిని ఖండించాల్సిందేనని బ్రిక్స్ దేశాలు ముక్తకంఠంతో తీర్మానించడం ద్వారా భారతదేశం దౌత్యపరంగా విజయం సాధించినట్లయింది. తాలిబన్, ఐఎస్ఐఎల్/డాయిష్, అల్ కాయిదా, హిక్కాని నెట్వర్క్, లష్కర్ ఎ తోయిబా, జైష్ ఇ మొహమ్మద్, టిటిపి, హిజ్బ్ ఉత్ తహ్రీర్ తదితర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల వల్ల భద్రత విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని బ్రిక్స్ జియామెన్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ, ఎవరు ఉగ్రవాద దాడులకు పాల్పడినా దానిని తాము ఖండిస్తున్నామని బ్రిక్స్ జియామెన్ డిక్లరేషన్లో పేర్కొన్నారు.








