మిస్ ఇండియాగా మానుషి ఛిల్లార్
మిస్ ఇండియా-2017 కిరీటాన్ని హరియాణాకు చెందిన మానుషి ఛిల్లార్ కైవసం చేసుకుంది. ముంబైలోని యశ్‌రాజ్ ఫిలిం స్టూడియోలో 54వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు కన్నల పండువగా జరిగాయి. పోటీల్లో 30 మంది పాల్గొనగా మానుషి విజేతగా నిలిచింది. ఆమెకు మిస్ వరల్డ్ -2016 స్టెఫనీ డెల్వాల్లే కీరిటాన్ని అలంకరించారు. మొదటి రన్నరప్‌గా మిస్ జమ్మూ కశ్మీర్ సనా దువా, రెండో రన్నరప్‌గా మిస్ బిహార్ ప్రియాంక కుమారి నిలిచారు.








