10 కాదు 20 ఏళ్లు : రేపిస్ట్ బాబాకు అసలు శిక్ష ఇదే
15 ఏళ్లనాటి అత్యాచార కేసులో రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అది పదేళ్లు కాదని, 20 ఏళ్లు అతడికి శిక్ష పడినట్టు బాబా తరపు లాయర్ మీడియాకు తెలిపారు. రెండు కేసుల్లో పదేళ్లు చొప్పున మొత్తం 20 ఏళ్లు విధించినట్టు లాయర్ ఎస్కే నర్వన తెలిపారు. అంతేకాక ఒక్కో కేసులో రూ.15 లక్షలు చొప్పున రెండు కేసుల్లో మొత్తం రూ.30 లక్షల జరిమానా విధించిందని, బాధితులు ఇద్దరికి చెరో రూ.14 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినట్టు లాయర్ వివరించారు. ఇప్పటి వరకు పదేళ్లు జైలు మాత్రమే అనుకుంటున్న బాబా అనుచరులు ఈ వార్త విని మరింత షాక్ కు గురయ్యారట.













