దంతాల అనారోగ్యం మరణానికి సూచన?
దంతాల ఆరోగ్యం మీ జీవితకాలాన్ని సూచిస్తుందా అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళలు చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నా, దంతాలు ఊడిపోతున్నా వారు మరణించే ప్రమాదం పెరుగుతుందట. ఈ మేరకు 55 ఏళ్లు, ఆపై వయసున్న 57 వేల మంది మహిళలపై ఆరున్నర సంవత్సరాలపాటు పరిశోధించి ఈ విషయం కనుగొన్నట్లు బఫెలో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఇందులో వ్యాధితో బాధపడుతునన మహిళలు మరణించే ప్రమాదం 12 శాతం, దంతాలు ఊడిపోతున్న వారిలో ఈ ముప్పు 17శాతం ఉందని వారు తెలిపారు.







