కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ
గుజరాత్ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరింది. వరుసగా రెండు రోజు శుక్రవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరో ఇద్దరు పదవులకు రాజీనామా చేశారు. మనీశ్ చౌహాన్, చనాభాయ్ చౌదరి స్పీకర్‌కు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే వీరు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులకు, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరగా, వెంటనే మరో ఎదురుదెబ్బ తగిలింది.








