విమాన ప్రయాణికుల కోసం ఎయిర్ సేవ
విమాన ప్రయాణికుల కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్ సేవ పేరుతో ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వెబ్ పోర్టల్గాను పనిచేస్తుంది. విమాన సర్వీసులకు సంబంధించిన ఎటువంటి సమాచారమైన ఇందులో లభిస్తుంది. వివిధ నగరాలకు అందుబాటులో ఉన్న విమాన సర్వీసులు, వాటి షెడ్యూళ్లు, సమయాలు అన్నీ తెలుసుకోవచ్చు. అంతే కాకుండా విమానంలో ఎంత లగేజీ తీసుకువెళ్లవచ్చు. ఆయా విమానాశ్రయాల్లో అందుబాటులో వున్న అదనపు సేవలు ఏమిటి? వాటిని ఎలా పొందవచ్చు అనే అన్ని వివరాలు లభిస్తాయి. వృద్ధులకు వీల్‌చైర్ అవసరమైతే ఎవరిని సంప్రదించాలి, విమానాశ్రయం దిగిన తరువాత వేరొక ప్రాంతానికి వెళ్లాలంటే అందుబాటులో ఉన్న ట్రావెల్స్, పార్కింగ్ సదుపాయం, రెస్ట్రూముల గురించి ఏ సందేహానైన్నా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు విమనాలు, విమానాశ్రయాల్లోనూ సేవల లోపంపై కూడా ఈ యాప్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు.













