కోవింద్‌కు గవర్నర్, సీఎంల అభినందనలు
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వలో దేశం అన్ని రంగాల్లో మరింత ముందుకెళ్తుందనే ఆశాభావాన్ని సీఎం కేసీఆర్ తన సందేశంలో వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించడంలో కోవింద్ సంపూర్ణ విజయం సాధించాలన్నారు. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం హర్షణీయం. రాజ్యాంగ బద్ధ పదవికి పోటీ వద్దన్నా యూపీఏ విన్లేదు. అయినా కోవింద్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఆనందంగా ఉంది. అమరావతిలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓట్లన్నీ ఎన్డీయేకు పడ్డాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.








