గవర్నర్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ భగవానుడు సమస్త మానవాళికి ఇచ్చిన భగవద్గీత సందేశాన్ని జన్మాష్టమి గుర్తుకు తెస్తుందన్నారు. గోకుళాష్టమిని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.








