జూలై 1 నుంచే జిఎస్టీ అమలు
జూలై 1 నుంచే జిఎస్టి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసింది. ఆరు నూరైనా ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. జిఎస్టి వాయిదా పడుతుందని వస్తున్న పుకార్లను ఏ మాత్రం పట్టించుకోవద్దని కోరింది. జిఎస్టి అమలు వాయిదా పడే అవకాశం ఉందన్న పుకార్లలో నిజం లేదు. దయచేసి వాటిని నమ్మి తప్పుదోవ పట్టోదు అని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు.








