బంగారం కొనేవారికి శుభవార్త
ఆభరణాల కొనుగోలుదారులకు వూరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50వేలకు పైగా విలువ చేసే నగల కొనుగోలుకు పాన్, ఆధార్ నిబంధనను ఎత్తివేసింది. దీనికి సంబంధించిన జీఎస్టీ నోటిఫికేషన్ను కేంద్రం రద్దు చేసింది. మరికొన్ని సంప్రదింపుల తర్వాత ప్రకటన విడుదల చేయనుంది. దీంతో పాటు రూ.2కోట్లు టర్నోవర్ గల నగల వ్యాపారులను మనీలాండరీంగ్ పరిధిలోకి రాకుండా నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వ ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన దృష్ట్యా జీఎస్టీ కౌన్సిల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.








